హైదరాబాదులో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం... రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- నాంపల్లిలో రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ
- తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
- నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు
- మృగశిర కార్తె రాత్రి రావడంతో ఈసారి రాత్రి 9 గంటలకు ప్రారంభం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏటా నిర్వహించే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు అందించే ఈ ప్రసాదం పంపిణీ రేపు (జూన్ 8) రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. మృగశిర కార్తె రాత్రి ప్రవేశిస్తుండటంతో ఈ మార్పు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగనుంది.
ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, సీపీఆర్ బృందాలను సిద్ధంగా ఉంచారు. భద్రత కోసం పోలీసులు, షీ టీమ్స్, సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేశారు.
చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీభవన్ లేదా గృహకల్ప వద్ద, ఆటోల్లో వచ్చేవారు షెజాన్ హోటల్ వద్ద దిగి గ్రౌండ్స్‌కు చేరుకోవాలి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు.